అమాంతం రక్తం పెంచుతుంది, నిద్రలేమి సమస్య తగ్గిస్తుంది – మన ఆరోగ్యం - Health Tips Galaxy

Breaking

Home Top Ad

Post Top Ad

Monday 9 May 2022

అమాంతం రక్తం పెంచుతుంది, నిద్రలేమి సమస్య తగ్గిస్తుంది – మన ఆరోగ్యం





వేసవికాలం వస్తే చాలు అందరికి చలువ చేసే ఫ్రూట్ అనగానే మొదటిగా గుర్తొచ్చేది పుచ్చకాయ. పుచ్చకాయ వేసవి కాలంలో చాలా ఎక్కువగా తీసుకుంటారు.పుచ్చకాయ వేడిని తగ్గించి తాపాన్ని తగ్గిస్తుంది. వేసవిలో రెండవదిగా గుర్తొచ్చేది ఖర్భూజ. పుచ్చకాయ శరీరంలో వాటర్కంటెంట్ రీప్లేస్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో మినరల్స్, లవణాలు, ఎలెక్ట్రాన్స్ అధికంగా ఉంటాయి. వేసవికాలంలో డీ హైడ్రేట్ అవ్వకుండా పుచ్చకాయ చాలా బాగా సహాయపడుతుంది. 

పుచ్చకాయ శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది. కర్బుజా కూడా వేసవిలో వేడిని తగ్గించడంలో  చాలా బాగా ఉపయోగపడుతుంది. కర్బూజాలు సోడియం లవణాలు  అధికంగా ఉంటాయి. మిగిలిన పళ్ళ తో పోలిస్తే దీనిలో నాలుగు రెట్లు సోడియం లవణాలు అధికంగా ఉంటాయి.  వేసవి కాలంలో శరీరం కోల్పోయే సోడియంను అందించడంలో కర్బుజా చాలా బాగా సహాయపడుతుంది.  పుచ్చకాయ తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ పెరిగి మన శరీరానికి అవసరమైన రక్తం తయారవుతుంది. 

మామిడి పండు తినడం వలన వేడి చేస్తుంది కాని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మామిడిపండుతో పాటు పుచ్చకాయ, కర్బూజా కలిపి తీసుకోవడం వలన శరీరంలో శరీరంలో మామిడిపండు వలన వచ్చిన వేడిని ఖర్బుజా, పుచ్చకాయ సరిచేస్తాయి.పగలు ఉడికించిన ఆహారం తీసుకుని రాత్రిళ్ళు ఫ్రూట్స్ తిన్నా సరిపోతుంది. మామిడిపండు ఒకటే తినడం వలన కడుపు నిండదు. అలాగే వేడి కూడా చేస్తుంది.

అందుకే రాత్రి భోజనంలో ఒక మామిడిపండు , కొంచెం పుచ్చకాయ ముక్క,కొంచెం ఖర్బుజా ముక్క తీసుకోవాలి.  ఇలా తీసుకోవడం వలన కడుపు నిండిన భావన కలుగుతుంది. వేడి కూడా చేయదు. అలాగే మనకి కూడా సీజనల్ ఫ్రూట్స్ తిన్న భావన కూడా కలుగుతుంది. ఇలా తీసుకోవడం  వలన నిద్రలేమి సమస్యతో బాధపడేవారు నిద్రలేమి సమస్య తగ్గి గాఢ నిద్ర పడుతుంది. అలాగే పుచ్చకాయ, ఖర్బుజా తీసుకోవడం వలన ఎక్కువ శక్తి లభిస్తుంది. 

బరువు తగ్గడంలో కూడా ఈ రెండు ఫ్రూట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. డైట్ చేసే వారు ఈ ఫ్రూట్స్ తినడం వలన ఎక్కువ శక్తి లభించి నీరసం రాకుండా యాక్టీవ్గా ఉంచుతాయి. పుచ్చకాయ మరియు ఖర్భుజా ఈ వేసవిలో తిని డీ హైడ్రేట్ సమస్య, నిద్రలేమి, రక్తం లేకపోవడం, అధిక బరువు వంటి సమస్యలు తగ్గుతాయి. మీరు కూడా వేసవికాలంలో ఈ ఫ్రూట్స్ తిని ఎంజాయ్ చేయడమే కాకుండా వాటివలన వచ్చే ఆరోగ్యప్రయోజనాలు కూడా పొందండి.



Post Views:
37



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages