క్యాన్సర్ రావడానికి కారణం, రాకుండా ఉండాలంటే తీసుకోవల్సిన జాగ్రత్తలు – మన ఆరోగ్యం - Health Tips Galaxy

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 1 May 2022

క్యాన్సర్ రావడానికి కారణం, రాకుండా ఉండాలంటే తీసుకోవల్సిన జాగ్రత్తలు – మన ఆరోగ్యం

   ప్రస్తుతం వాళ్లు, వీళ్ళు అని తేడా లేకుండా అందరికి క్యాన్సర్ మహమ్మారికి విజృంభిస్తోంది. క్యాన్సర్ రావడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే ఎవరికి అర్థం కావట్లేదు. కాన్సర్ వచ్చిన వాళ్ళు నేను ప్యాకేజడ్ ఫుడ్ తినను జంక్ ఫుడ్ తినను రెస్టారెంట్ ఫుడ్ తినను ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ తినను. ఐనా నాకు క్యాన్సర్ వచ్చింది అని చాలా మంది అంటారు. క్యాన్సర్ రావడానికి ఇవి ఒక్కటే కారణం కాదు. మనం ఇంట్లో వండే ఆహారం కూడా కారణం.

వాటిలో మొదటిది ధాన్యాలు, పిండి, రవ్వలతో చేసినవి ఎక్కువగా తినడం వలన క్యాన్సర్ వస్తుంది.కొంతమంది అవసరం అయిన దానికంటే ఎక్కువ తింటారు. మనం ఎంత పని చేసిన మోతాదుకు మించి తినడం కూడా మంచిది కాదు. రెండవది చక్కెర ఎక్కువగా తినడం. చక్కెర ఎక్కువ తీసుకోవటం అంటే షుగర్, బెల్లం తినడం మాత్రమే కాదు శరీరంలో షుగర్ లెవెల్స్ పెంచే ఆహరం తీసుకోవడం. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం వలన ఇవి శరీరంలో షుగర్ లెవెల్స్ పెంచుతాయి.

దీనివలన రక్తంలో కణజాలం దెబ్బతింటుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవటం వలన కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మూడవదిగా నూనెలో దేవిన పదార్థాలు, ఫ్రై లు, కూరలు, బేకరీ ఫుడ్స్ తినడం , ప్యాకేజ్డ్ ఫుడ్స్ , జంక్ ఫుడ్స్,కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ప్రిజర్వేటివ్స్ తినడం, ఆల్కహాల్ తీసుకోవడం, సిగరెట్, పొగాకు, పాన్ గుట్కా వంటివి తీసుకోవడం వలన కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మైక్రోవేవ్ లో వండే ఆహారం తీసుకోవటం వలన ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని కొన్ని దేశాల వాళ్ళు మైక్రోవేవ్ పూర్తిగా నిషేదించారు.

నాల్గవది నిల్వ పచ్చళ్ళు తినడం. కొంతమంది ఇంట్లో చేసినవి మాత్రమే తింటున్నాం అంటారు. వాళ్ళు ఇంట్లో నిల్వ పచ్చళ్ళు తింటున్నాం అని మాత్రం చెప్పరు. నిల్వ పచ్చళ్ళు లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది. ఇది రక్తంలో కలిసి పోకుండా DNA ను డామేజ్ చేస్తుంది.దీనివలన మంచి కణజాలం విడుదల చేయాల్సిన DNA హాని కలిగించే క్యాన్సర్ కణాలని ఉత్పత్తి చేస్తుంది. అందుకే మనం రోజూ నాచురల్ ఫుడ్ తీసుకుని సరైన ఆహార నియమాలు పాటించాలి. ఇలా చేసినట్లయితే క్యాన్సర్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.Post Views:
814No comments:

Post a Comment

Post Bottom Ad

Pages